ఇక యుద్ధ క్షేత్రంలో భారత నారీమణులు

0
51

ఇక యుద్ధ క్షేత్రంలో భారత నారీమణులు

భారత​ ఆర్మీలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాడేవారిగా కేవలం పురుషులు మాత్రమే కనిపించగా మున్ముందు మహిళలు కూడా పాలుపంచుకోనున్నారు. వారు నారీమణులుగా అవతారం ఎత్తనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు.

‘మహిళలు జవాన్లు రావడం అనే అంశాన్ని నేను పరిశీలిస్తున్నాను. త్వరలోనే నేను ఆ ప్రక్రియను ప్రారంభిస్తాను. తొలుత మిలిటరీ పోలీసు జవాన్లుగా మహిళలకు బాధ్యతలు ఇస్తాం’ అని ఆయన చెప్పారు. మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్‌, లీగల్‌, ఎడ్యుకేషనల్‌, సిగ్నల్స్‌, ఇంజినీరింగ్‌ శాఖల్లో ఇప్పటికే మహిళకు అవకాశం ఇస్తున్న ఆర్మీ త్వరలోనే ప్రత్యక్ష యుద్ధ క్షేత్రంలోకి మహిళలను దించనుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here