పాక్‌పై కోహ్లి సర్జికల్‌ స్ట్రైక్‌!

0
48

పాక్‌పై కోహ్లి సర్జికల్‌ స్ట్రైక్‌!

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో దయాదులు సమరం కోసం అభిమానులు అమితాస్తితో ఎదురు చూస్తున్నారు. ఎడ్జ్‌బాట్సన్‌ మైదానం వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి ఆధిపత్యం కొనసాగించాలని మెన్‌ ఇన్‌ బ్లూ ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. ఇండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, హోమాలు, యాగాలు చేస్తున్నారు. గోరఖ్‌పూర్‌, వారణాసిలో హోమాలు నిర్వహించారు.

‘మేము చాలా అంచనాలు పెట్టుకున్నాం. పాకిస్తాన్‌ను భారత్‌ చాలాసార్లు ఓడించింది. ఈసారి కూడా పాకిస్తాన్‌కు భంగపాటు తప్పదు. విరాట్‌ కోహ్లి సిక్సర్లు కొడితే బాగా ఎంజాయ్‌ చేస్తాం. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నామ’ని ఢిల్లీ అభిమాని ఒకరు చెప్పారు. కెప్టెన్‌ కోహ్లి తన బ్యాటుతో పాక్‌ బౌలర్లపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘రంజాన్‌, మన కోసం నేను ఉపవాసం ఉంటున్నాను. మన దేశం గెలవాలని కోరుకుంటున్నాను. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా కచ్చితంగా పాకిస్తాన్‌ జట్టును ఓడిస్తుంద’ని జమ్మూకశ్మీర్‌ అభిమాని ఆకాంక్షించారు.

కోహ్లి భరతం పడాతనని ప్రతినబూనిన పాక్‌ బౌలర్‌ జునైద్‌ఖాన్‌ జట్టులో లేకపోవడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి పోరు చూడాలనుకున్న వారు మాత్రం కొద్దిగా నిరాశకు గురయ్యారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here