పాక్‌పై గెలిస్తే.. ఆ నదిలో మునిగినట్టే!

0
48

పాక్‌పై గెలిస్తే.. ఆ నదిలో మునిగినట్టే!

అమృత్‌సర్‌: భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ చాంపియన్స్‌ ట్రోఫీలో దాయాదుల సంగ్రామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు శుభాశీస్సులు అందజేసిన ఆయన.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను కనుక ఓడిస్తే.. అది టీమిండియాకు గొప్ప గౌరవమవుతుందని, పవిత్ర గంగానదిలో మునిగినంతా పుణ్యం కలుగుతుందని చమత్కరించారు.

‘పాకిస్థాన్‌పై విజయం సాధించడం నిజంగా గొప్ప గౌరవం. పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిస్తే గంగానదిలో మునిగి సకల పాపాలన్నీ కడిగేసుకున్నట్టే’ అని ఆయన వ్యాఖ్యానించారు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగుతున్న దాయాదుల సమరాన్ని సరిహద్దులకు ఇరువైపులా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా వీక్షిస్తున్న నేపథ్యంలో సిద్దూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here