బాబు దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌: సీపీఐ నేత రామకృష్ణ

0
146

బాబు దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌: సీపీఐ నేత రామకృష్ణ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో చేపట్టిన నవనిర్మాణ దీక్షకు 10 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే కనీసం 2 వేల కుర్చీలు కూడా నిండలేదని..మొత్తంగా ఈ దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ఏపీ సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మగ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా సాధనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం అమలు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముందుకు రాకపోతే చరిత్రలో మోసగాళ్లుగా నిలిచిపోతారన్నారు. ప్రత్యేకహోదా సాధనకు గుంటూరులో సాగుతున్న కార్యక్రమానికి సీపీఐ మద్దతునిస్తోందన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here