బాహుబలి…నో కామెంట్‌!

0
180

బాహుబలి…నో కామెంట్‌!

బాహుబలి’ హిందీ వెర్షన్‌ లాభాల్లో వాటాతో పాటు భారీ పారితోషకం, స్టార్‌ హోటల్లో ఐదు సూట్‌ రూమ్స్‌ అడగడంతో శివగామి పాత్రకు శ్రీదేవిని వద్దనుకున్నామని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అప్పుడు రాజమౌళిని అడిగిన ప్రశ్ననే కొంచెం మార్చి, ఇప్పుడు శ్రీదేవిని అడిగింది హిందీ మీడియా.

శ్రీదేవి నటించిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘మామ్‌’ ప్రమోషన్‌లో ‘బాహుబలిలో శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారు?’ అని ప్రశ్నించారొకరు. వెంటనే శ్రీదేవి ‘నో కామెంట్‌’ అన్నారట! శ్రీదేవి టైటిల్‌ రోల్‌లో నటించిన ‘మామ్‌’ వచ్చే నెల 7న రిలీజ్‌ కానుంది. ఆమె భర్త బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాకు శ్రీదేవి బాగా ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రశ్న ఆమెకు ఎన్నిసార్లు ఎదురవుతుందో? ఎదురైన ప్రతిసారీ ఆమె ‘నో కామెంట్‌’ అంటారా! అసలు సంగతి చెబుతారా!!

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here