రోహిత్-ధావన్ ల సరికొత్త రికార్డు..

0
991

రోహిత్-ధావన్ ల సరికొత్త రికార్డు..

బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ లో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి భారత జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో మూడో సెంచరీ భాగస్వామ్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అత్యధిక శతకాల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా అరుదైన ఫీట్ ను నెలకొల్సారు. వీరి తర్వాత క్రిస్ గేల్-చందర్ పాల్(వెస్టిండీస్), గిబ్స్-గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)లు రెండేసి సెంచరీ భాగస్వామ్యాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు భారత ఇన్నింగ్స్ ను కుదురుగా ఆరంభించారు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ ఆపై బ్యాట్ ఝుళిపించారు. ఈ క్రమంలోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్ గా అవుటయ్యాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here