ఇద్దరు ఉగ్రవాదులపై కాల్పులు

0
47

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఓ ఇంట్లో దాగి ఉన్న
ముష్కరులపై కాల్పులు జరిపి హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
బారాముల్లాలోని రఫియాబాద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనేసమాచారం రావడంతో పోలీసులు,
భద్రతాసిబ్బంది సంయుక్తంగా నిన్న రాత్రి నుంచి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ముమ్మర
తనిఖీలు చేపట్టారు. పజల్‌పొరా గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని గుర్తించిన
భద్రతాసిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ముష్కరులు జవాన్లపైకి కాల్పులు జరిపారు.
దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలంలో రెండు
ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం కూడా తనిఖీలు కొనసాగుతున్నట్లు
అధికారులు వెల్లడించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here