యోగా ప్రపంచానికి గొప్ప వరమన్నా చంద్రబాబు

0
1008

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో
ఆయన పాల్గొని ప్రజలతో కలిసి యోగసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘యోగాతో
ప్రపంచంలో ఏదైనా సాధించగలం. యోగా ఒక్కప్పుడు భారత్‌కే పరిమితం.. మోదీ ప్రధాని అయ్యాక యోగాపై
ఐరాసలో ప్రతిపాదన ఇచ్చారు. ప్రపంచం మొత్తం పాటిస్తే మానవాళికి ఉపయోగపడుతుందని వివరించారు.
ఐరాస పిలుపు మేరకు 177 దేశాల్లో యోగా జరుపుకుంటున్నారు. యోగాతో మనసు ప్రశాంతంగా
ఉంటుంది. సంక్షోభంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి. రాష్ట్రం విడిపోయిందని బాధపడుతూ కూర్చుంటే
మూడేళ్లలో ఇంత అభివృద్ధి సాధించగలిగేవారమా? అన్నారు.. అలాగే సంకల్పాన్ని నిజం చేసుకునేందుకు
ప్రతి ఒక్కరూ కష్టపడాలని చంద్రబాబు సూచించారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here