లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్నుశాఖ కొరడా

0
125

బినామీ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. రూ. 170 కోట్లకు పైగా విలువైన 12 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈమేరకు లాలూ భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సబ్యులకు నోటీసులిచ్చింది. రూ. వెయ్యి కోట్ల భూ లావాదేవీలు, పన్ను ఎగవేత కేసును దర్యాప్తు చేస్తున్న ఐటీ శాఖ – వీరంతా బినామీ ఆస్తులతో ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించింది. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద వారందరిపైనా అభియోగాలు నమోదు చేసి, దిల్లీ, బిహార్‌లోని ఇళ్ల స్థలాలు, భవనాలు, ఇతర ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. వీటిలో పాలమ్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రం, దక్షిణ దిల్లీలోని నివాస భవనం, పట్నాలోని 2.56 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని 9 ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఐటీ శాఖ గత నెలలో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఐతే ఈ విషయంపై తేజస్వియాదవ్ స్పందిస్తూ ఇవన్నీ వదంతులేనని, కుట్రలో భాగంగా ప్రచారం చేస్తున్నారంటూ ఖండించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here