వెండితెరపై కనిపించనున్న..సానియా మీర్జా

0
54

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ తార సానియా మీర్జా త్వరలో వెండితెరపై కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఇందుకు సంబంధించిన చిన్న క్లూను ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.ఫాదర్స్‌ డే సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌తో సానియామీర్జా తన తండ్రితో ఉన్న ఫొటోను పంచుకుంది. దీనిపై స్పందించిన ఫర్హాన్‌ అక్తర్‌ సానియాకు ధన్యవాదాలు తెలుపుతూ… ఒక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కారణంగానే సానియా వెండితెరపై మెరవనుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సానియాకు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, తన టెన్నిస్‌ కెరీర్‌ సాఫీగా సాగేందుకు తండ్రి అందించిన తోడ్పాటుపై తీసే చిన్నపాటి డాక్యుమెంటరీలో కనిపించనుందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే త్వరలోనే సానియా జీవితంలో తండ్రి ముద్ర ఎంత వరకు ఉందో తెలిపే చిత్రాన్ని రూపొందిస్తాను అన్నది ట్వీట్‌ సారాంశం. దీనిపై సానియా స్పందిస్తూ ఇది ఎంతో ప్రత్యేకం. ఎదురుచూడలేకపోతున్నాను అని మరో ట్వీట్‌ పెట్టారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here