లక్షల బకాయిలు: జగన్ పార్టీ ఎమ్మెల్యే థియేటర్లకు పవర్ కట్

0
60

కృష్ణా: నూజివీడు శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకా ప్రతాప్‌ అప్పారావుకు చెందిన రెండు సినిమా థియేటర్లకు విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ద్వారకా థియేటర్‌కు రూ.8.50లక్షలు, తిరుమల థియేటర్‌కు రూ.6లక్షల మేర విద్యుత్‌ బకాయిలు ఉన్నందున సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. బిల్లు చెల్లించాలని అధికారులు గతంలో థియేటర్‌ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ఎమ్మెల్యే రూ.1.50లక్షల చెక్కును సంబంధిత శాఖ అధికారులకు ఇవ్వగా అది బౌన్స్‌ అయింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు థియేటర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.

కొండపై ఇళ్లను కూల్చేసిన కార్పొరేటర్ భర్త: జనాగ్రహం

కృష్ణా జిల్లాలోని మొగల్రాజపురంలో కార్పొరేటర్‌ జ్యోతి భర్త రత్నాకర్ హల్‌చల్ చేశాడు. కొండపై నివాసముంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. అంతేగాక, వాళ్లు ఎంత వేడుకున్నా వినకుండా.. కార్పొరేటర్ భర్త, అనుచరులు రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు కొండమీద నివాసముంటున్న వారు ససేమీరా అనడంతో ఇళ్లను కూల్చేశాడు. రెండేళ్ళుగా కొండపైనే నివాసం ఉంటున్నామని బాధితులు తమ గోడును మీడియాకు వివరించారు. తక్షణమే రత్నాకర్‌పై ఉన్నతాధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here