పాకిస్తాన్‌లో 21 మారుపేర్లతో తిరుగుతున్న దావూద్

0
1285
కరాచీ: ముంబాయి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్‌లో మూడు మారు అడ్రస్‌లు ఉన్నాయని, ఆయన పాక్‌లోనే ఉన్నాడని తేలింది. దావూద్ 21 మారు పేర్లతో చెలామణి అవుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తేల్చింది. బ్రిటన్ ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఉన్న భారత జాతీయుడు ఒక్కడే.. ఆయనే దావూద్ ఇబ్రహీం. బ్రిటన్ ఆర్థిక ఆంక్షల జాబితాలో ఎల్‌టీటీఈ, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్‌లు కూడా ఉన్నాయి. ఆల్‌ఖైదా, ఐసీస్ వంటి ముష్కర ముఠాలను ఈ జావితాలో చేర్చారు. ఈ సంస్థలకు నిధులు ట్రాన్సఫర్ చేయడంపై బ్రటన్ ప్రభుత్వం నిషేధం విచించింది.
దావూద్‌కు ఉన్న మూడు అడ్రస్‌లు కరాచీవే కావడం విశేషం. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అధారిటీ, నూరాబాద్, సౌదీ మసీదు సమీపంలోని వైట్ హౌస్ ప్రాంతంలో దావూద్ చిరునామాలు రికార్డు అయ్యాయి. గత ఏడాది బ్రిటన్ ప్రభుత్వం నాలుగు అడ్రాస్‌లు ఇచ్చినా, దాన్నిప్పుడు తొలగించింది. బ్రిటన్‌లోనూ బినామీ పేర్లతో దావూద్ ఇబ్రహీంకు ఆస్తులు ఉన్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించిన దావూద్ 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. ఆ మారణ కాండ తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ్నించి పాకిస్తాన్‌లోని కరాచీ చేరుకున్నాడు. అక్కడ్నించి నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here