” ప్రభుత్వమే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది”, ”ఓటమి భయంతోనే వైసీపీ గొడవ”

0
1571

నంద్యాలలో టిడిపి నేత అభిరుచి మధు, వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిల మధ్య గొడవపై మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న జగన్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె చెప్పారు.పథకం ప్రకారంగానే వైసీపీ నేతలు మధుపై దాడికి ప్రయత్నించారని మంత్రి ఆరోపించారు. ప్రాణ రక్షణ కోసమే మధు గన్‌మెన్ గాల్లోకి కాల్పులను జరిపాడని ఆమె చెప్పారు. అభిరుచి మధు, వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి వర్గాల మధ్య చోటుచేసుకొన్న గొడవ సందర్భంగా మధు ప్రైవేట్ గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు.వైసీపీ వర్గీయులు మధు కారుపై రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో మధు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి

హైదరాబాద్: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది.ఈ దాడికి పాల్పడిన టిడిపి నేత అభిరుచి మధును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. గురువారం నాడు హైద్రాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా రక్తచరిత్రేనని ఆయన ఆరోపణలు చేశారు. టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. నడిరోడ్డుపై రౌడీలు వీరవీహరం చేస్తోంటే పోలీసులు పారిపోతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రౌడీషీటర్‌కు గన్‌మెన్ ఎక్కడ నుండి వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయుధాలను పోలిస్‌స్టేషన్‌లో ఎందుకు అప్పగించలేదని, టిడిపి నేతలకు నిబంధనలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. ఇంకెంతకాలం పాటు టిడిపి నేతలు వీరంగం సృష్టిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వమే రౌడీయిజం చేస్తోందన్నారు. రౌడీలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని శ్రీకాంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత నారాయణరెడ్డిని దారుణంగా చంపినా చంద్రబాబునాయుడు కనీసం చర్యలు తీసుకోలేదన్నారు. కళ్ళ ఎదురుగానే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వమే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది: అంబటి నంద్యాలలో టిడిపి నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి మెప్పుకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడు రోజులుగా శిల్పా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొన్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాల్పును ప్రభుత్వ వైఫల్యంగా చూడాలన్నారు. టిడిపి నేతలు కాల్పులు జరపడం దారుణమన్నారు. టిడిపి నేతలు కాల్పులు జరుపుతోంటే పోలీసులు పారిపోయారని చెప్పారు.
l

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here