రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి

0
1027

కన్నడ టీవీ సీరియల్స్ మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్యాంకర్ ను డీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జీవన్ డ్రైవింగ్ సీట్లో ఉండగా రచన అతని పక్క సీట్లో కూర్చోని ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్న మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బుధవారం రచన, జీవన్ ల స్నేహితుడు కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కర్నాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన రచన, జీవన్ ల మిత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here