హైదరాబాద్‌లో జాబ్ కోసం ప్రిపేర్ అయేందుకు.. ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ..

0
142

యువకుడి ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్‌
మరో ముగ్గురు స్నేహితులు గాయాలపాలు

హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఇయర్‌ ఫోన్లు ఓ యువకుడి ప్రా ణాన్ని తీశాయి. భవంతి కింద ఉన్న స్నేహితునికి రెండో అంతస్థు నుంచి సెల్‌ఫోన్‌ ఇయర్‌ ఫోన్లు వేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై ఓ విద్యార్థి అక్కడిక్కడే దుర్మరణం పాలవగా, మరో ముగ్గురు స్నేహితులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగపల్లె గ్రామానికి చెందిన గంగ శ్రీనివా్‌సరావు కుమారుడు రవీందర్‌ (30) ఎంబీఏ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తమ గ్రామానికి చెందిన స్నేహితులైన మన్మథరావు, మురళీ, సతీష్‌, పవన్‌లతో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీ, గౌతంనగర్‌ కాలనీలోని ఇ.నెం.10-13లో శ్రీకృష్ణ ఎన్‌క్లేవ్‌ అనే బహుళ అంతస్థుల భవనం రెండో అంతస్థులో నివాసం ఉంటున్నారు. పవన్‌ బీటెక్‌ చేస్తుండగా మిగతా నలుగురు ఎంబీఏ పూర్తి చేసి గ్రూప్‌-2 పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నారు.

 


హైటెన్షన్‌ వైర్లకు తాకడంతో…
ఆదివారం పవన్‌ పని నిమిత్తం బయటకు వెళ్లేందుకు గదిలో నుంచి కిందకు దిగాడు. ఆ సమయంలో గదిలో మన్మథరావు చదువుకుంటుండగా, రవీందర్‌, మురళీ, సతీ్‌షలు రోడ్డువైపు బాల్కానీలో నిలబడి ఉన్నారు. అయితే సెల్‌ ఇయర్‌ఫోన్స్‌ మరచిపోయిన పవన్‌ వాటిని కిందకు వేయమనడంతో రవీందర్‌ రెండో అంతస్థు నుంచి కిందకు వేశాడు. అయితే భవనం ముందు ఉన్న చెట్టు కొమ్మలో ఇయర్‌ ఫోన్స్‌ చిక్కుకున్నాయి. దీంతో గదిలో ఉన్న కర్టన్‌ రాడ్డు తీసుకువచ్చి ఇయర్‌ఫోన్లను లాగే ప్రయత్నం చేస్తున్నాడు. చెట్టు కొమ్మ పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లకు ప్రమాదవశాత్తు కర్టన్‌ రాడ్డు తగిలింది. ఇనుపరాడ్డు కావడంతో రాడ్డు పట్టుకున్న రవీందర్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతేగాక రాడ్డు బాల్కాని గోడకు తగలడంతో బాల్కాని మొత్తానికి విద్యుత్‌ ప్రవహించింది. అదే సమయంలో విద్యుదాఘాతానికి గురైన రవీందర్‌ బాల్కానిలో చదువుకుంటున్న మన్మథరావు, మురళీల మీద పడటంతో వారు ముగ్గురికి షాక్‌ తగిలి గదిలోపలికి పడ్డారు. విద్యుదాఘాతానికి గురైన వీరి కేకలు విన్న ఇరుగు, పొరుగు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. రవీందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గుర్ని దిల్‌సుఖ్‌నగర్‌లోని కమల ఆసుపత్రికి తరలించారు. మురళీకి కుడి చేయి, కాలుకు బలమైన గాయాలవడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సతీష్‌, మన్మథరావులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సరూర్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here