270 మందిపై డేరా బాబా అత్యాచారం బాంబు పేల్చిన బాడీగార్డ్..?

0
915

దైవదూతగా, రాక్ స్టార్ బాబాగా ప్రకటించుకున్న మానవ మృగం గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అని అతనికి బాడీగార్డ్ గా పని చేసిన బియాంత్ సింగ్ చెబుతున్నారు. గుర్మీత్ రాం రహీం సింగ్ కు శిక్ష విధించి, జైలుకు తరలించిన నేపథ్యంలో అతని పాపాల చిట్టాను ఆయన బాడీగార్డ్ బయటపెట్టాడు. ఒక ఇంగ్లిష్ టీవీ ఛానెల్ తో బియాంత్ సింగ్ మాట్లాడుతూ, గుర్మీత్ 270 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. సిర్సాలో పితాజీ గుఫాగా పిలిచే గుర్మీత్ అధికారిక నివాసం గుహ కాదని, యువతుల పాలిట నరకమని, అత్యాచారాలకు గురయ్యే అబలల ఆక్రందనలతో ప్రతిధ్వనించిన పాపకూపమని ఆయన వ్యాఖ్యానించారు.

1995-96లో మౌంట్‌ అబులో గుర్మీత్ సత్సంగ్‌ నిర్వహించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా వేసిన క్యాంపులో ఒక టెంటుకు తాను కాపలా కాస్తుండగా, అక్కడికి చేరుకున్న గుర్మీత్ ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పిలిచి, ఆ టెంట్‌ లోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి ఆర్తనాదాలు తాను స్పష్టంగా విన్నానని చెప్పాడు. దీంతో గుర్మీత్ అంటే తనకు అసహ్యం వేసిందని బాడీగార్డ్ బియాంత్ సింగ్ చెప్పారు. ఇక సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో ఆయన ‘గుఫా’ వద్దకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారని, వారిలో ఒక యువతితో డేరాలో రాత్రంతా గడిపేవాడని ఆయన తెలిపారు. దీనిపై గార్డులంతా చర్చించుకునేవారమని, ఇతర గార్డులు అతనిపై భక్తి చూపించేవారు కానీ, తాను గుర్మీత్ రాసలీలలు కళ్లారా చూడడంతో వారి అభిప్రాయాలతో తాను విభేదించేవాడినని బియాంత్ సింగ్ చెప్పారు. గుర్మీత్ రేప్ చేసిన యువతి ఇప్పటికీ డేరాలో ఉందని ఆయన షాకిచ్చారు. కేవలం ఆమె మాత్రమే కాదని, 270 మందికి పైగా అమ్మాయిల్ని గుర్మీత్ రాం రహీం సింగ్ రేప్ చేశాడని బియాంత్ సింగ్ చెప్పారు. 300 మంది సాధ్వీల్లో 90 శాతం మంది అతడి కామదాహానికి బలైనవారేనని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. గుర్మీత్ బాబాకు ఇద్దరిపై చేసిన అత్యాచారాల్లో మాత్రమే శిక్ష పడిందని ఆయన అన్నారు. ఆయన బయటకు రాకూడదని బాడీగార్డ్ గా పనిచేసిన బియాంత్ సింగ్ ఆకాంక్షించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here