హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రకంపనలు.. పరిపాలనాధికారిపై వేటు..?

0
41

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 28న కలెక్టరేట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన యోగితారాణా తన మార్క్‌ను చూపిస్తున్నారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జహురుద్దీన్‌పై వేటు వేశారు. అతడిని యూఎల్‌సీకి కేటాయి స్తూ ఆదేశాలు జారీ చేశారు. కొన్నేళ్లుగా జహురుద్దీన్‌ ఏఓగా విధులు నిర్వహిస్తున్నారు. తన వేగాన్ని అందుకోని అధికారులను బాధ్యతల నుంచి తప్పించి మరో చోటుకు బదిలీ చేస్తున్నారు. అందులో భాగంగా మరో ఎనిమిది మందిని బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో సీసీగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిలో ఒకరిని గోల్కొండకు, మరొకరిని యూఎల్‌సీకి కేటాయించారు. అనూహ్య పరి ణామాలతో ఉద్యోగులు నోళ్లు తెరుస్తున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టకముందు ఇక్కడి పరిస్థితిని ఆరా తీసిన యోగితా స్వయంగా ఓ నివేదికను తయారు చేసుకున్నట్టు సమాచారం. దాని ఫలితమే బదిలీలని తెలుస్తోంది. ల్యాండ్‌ ప్రొటెక్షన్‌, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి, డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌.రాధికారమణికి ఏఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ యోగితారాణా ఆదేశాలిచ్చారు.

బదిలీలు క్రింది విదంగా
ఏఓగా విధులు నిర్వహిస్తున్న జహురుద్దీన్‌ను యూఎల్‌సీకి బదిలీ చేశారు. అక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంవీవీ. ప్రసాద్‌రావుకు కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పోస్టు ఇచ్చారు.
కలెక్టర్‌ పేషీలో సీసీగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ కేవీవీ.సీతారామ్‌ను యూఎల్‌సీ విభాగానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో పనిచేస్తున్న తహసీల్దార్‌ బాల శంకర్‌కు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు.
కలెక్టరేట్‌లో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.అనురాధా బాయ్‌కు కలెక్టర్‌ పేషీ సీసీగా పోస్టింగ్‌ లభించింది. రెండో సీసీగా జూనియర్‌ అసిస్టెంట్‌ రాజుకు పోస్టింగ్‌ ఇచ్చారు.
మరో నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో ఇద్దరు కీలక అధికారులపై వేటు మరో పది రోజుల్లో ఇద్దరు కీలక అధికారులపై వేటు పడనుంది. ఆ ఇద్దరిపై కలెక్టర్‌ ఆగ్రహంగా ఉన్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఆ అధికారులు.. స్వీయ నిర్ణ యాలు తీసుకోవడం, నిధులు దుర్వినియోగమయ్యే కార్యక్రమాలు చేపట్టడం, ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించడంలో అత్యుత్సాహం చూపేవారు. వారిపై ఎన్నో ఆరోపణలున్నాయి. వారికి చెక్‌ పెట్టడానికి కలెక్టర్‌ యోచిస్తున్నట్టు సమాచారం. నిబద్ధతతో పనిచేయని అధికారులను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here