బాలయ్య వస్తే దబ్బిడి దిబ్బిడే….. రానా షోలో ‘తేడా సింగ్’ సందడి!

0
855

నందమూరి నట సింహం బాలకృష్ణ త్వరలో ‘పైసా వసూల్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య, దర్శకుడు పూరి రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి విత్ రానా’ షోకు వెళ్లారు. ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య తేడా సింగ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. రానా షోలో బాలయ్య కొంతసేపు ‘తేడా సింగ్’గా సందడి చేశారు. పైసా వసూల్ పాటకు డాన్స్ చేసి అలరించారు. బాలయ్య టీవీ షోకు వస్తే మామూలుగా ఉండదని, దబ్బిడి దిబ్బిడే అని మరోసారి రుజువుచేశారు బాలయ్య.

సెప్టెంబర్ 3 ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం అయ్యే టీవీ షోలో రానా సందడి చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వస్తోంది.
ఫన్నీ ముచ్చట్లు ఈ షోలో రానా కొన్ని ఫన్నీ ప్రశ్నలను బాలయ్యపై ప్రయోగించగా తనదైన రీతిలో ఆయన సమాధానం చెప్పినట్లు స్పష్టం అవుతోంది. బాలయ్య రాకతో ఈ షోకు భారీ రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు.

పైసా వసూల్ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా భ‌వ్య‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వి.ఆనందప్ర‌సాద్ నిర్మించిన చిత్రం పైసావ‌సూల్‌. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో శ్రీయ, ముస్కార్ సేథి, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు.

సెప్టెంబర్ 1న రిలీజ్ సెప్టెంబర్ 1న ‘పైసా వసూల్’ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here