2019లో కూడా రోజానే పంపించండి: మంత్రి సోమిరెడ్డి

0
950
2019 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే రోజాను ప్రచారానికి పంపాలని, వైసీపీ సభ్యులు ఇదే విధంగా మాట్లాడితే మంచి భవిష్యత్ ఉంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు ఏపీ మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్, అతడి బృందానికి నంద్యాల వాసులు పెద్ద గుణపాఠం చెప్పారని వారు అన్నారు.
గత మూడు సంవత్సరాల చంద్రబాబు పరిపాలకు నంద్యాల ఎన్నికలు రెఫరెండం అని మంత్రి సోమిరెడ్డి అన్నారు. అలాగే 2019లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావాలని నంద్యాల ప్రజలు సందేశమిచ్చారన్నారు. నంద్యాలలో టీడీపీకి ఓటేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. 13ఏళ్ల నుంచి నంద్యాలలో పాతుకుపోయిన నేతను భూమా కుటుంబసభ్యులు ఓడిపోయేలా చేశారని అన్నారు. జగన్ బృందానికి నంద్యాల ప్రజలు గుణపాఠం చెప్పారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
న్యాయానికి, ధర్మానికి పనిచేసిన ప్రభుత్వానికి నంద్యాల ప్రజలు పట్టంకట్టారని మరో మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నంద్యాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తిని, వైసీపీ పార్టీని తానెప్పుడు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తండ్రి పేరు… డబ్బుతో నాలుగు సంవత్సరాలుగా పార్టీని నడిపారే తప్ప, ప్రజల అభిమానంతో పార్టీ నడవలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here