తారక్ అన్నకు ముఖం మీదే చెప్పేశా: కత్తి కార్తీక

0
909
తెలంగాణ పోరీ అనే పదానికి నికార్సైన నిర్వచనం కత్తి కార్తీక. దాదాపు 43 రోజులు ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్న ఆమె ఈ మధ్యే ఎలిమినేట్ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ‘బిగ్ బాస్’ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తారక్ హోస్టింగ్ గురించి మాట్లాడారు.
          ‘‘ఎప్పుడైతే తారక్ అన్నను ఫేస్ టూ ఫేస్ చూశానో.. అప్పుడు ‘అన్న మరో వంద సీజన్లు నువ్వే హోస్ట్ చెయ్. నన్ను కొట్టినా పర్లేదు. నీకు తెల్ల వెంట్రుకలు వచ్చినా.. రంగు మాత్రం వేసుకోకుండా అట్లనే చెయ్’ అని ముఖం మీదనే చెప్పేశా. ‘బిగ్ బాస్’ అంటే తారక్ అన్న హోస్టింగ్. ‘బిగ్ బాస్’ స్క్రిప్ట్‌తో నడిచే షో కాదు. తారక్ అన్న షోలో ప్రతీది గమనిస్తాడు. ఆయన ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఏదైనా తప్పు చేస్తే అమ్మానాన్న ఎలా సరిదిద్దుతారో.. తారక్ అన్న కూడా అంతే..! అది తారక్ అన్నను చూస్తే కనిపిస్తుంది. ఏదైనా కరెక్ట్‌గా మాట్లాడుతాడు. అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ షో ఎట్లయితే స్క్రిప్ట్ ప్రకారం నడవట్లేదో.. తారక్ అన్న కూడా అంతే.. ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడుతాడు’’ అని తారక్‌పై కత్తి కార్తీక ప్రశంసల వర్షం కురిపించారు.
  

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here