‘అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్

0
66

ఇటీవల విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఓ వైపు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్నప్పటికీ, సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు, బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరగుతోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో హీరో ఎవరినో తిట్టేక్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు పయోగించడంపై అనసూయ మండి పడుతున్నారు. ఎమోషన్‌కు గురైనపుడు తిట్లు రావడం మామూలే. కానీ అందుకు చాలా పదాలు ఉన్నాయి. తల్లిని ఉద్దేశించిన తిట్లు వాడటం సరైంది కాదు అనేది అనసూయ వాదన. దీనిపై ఆమె ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ చేశారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here