పవన్ కొత్త సినిమా పేరు అఙ్ఞాతవాసి ?: పవన్ సెట్స్ కి వెళ్ళి మరీ విషెస్ చెప్పిన చిరంజీవి

0
63

ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. మరోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వయంగా పాడుతున్న ఈ పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే.. pspk25గా ప్రచారం పొందుతున్న ఈ సినిమా టైటిల్ ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.

టైటిల్ మాత్రం చెప్పలేదు జనవరి 10న రిలీజ్ అని చెప్పారు కానీ.. టైటిల్ మాత్రం చెప్పలేదు. అయితే.. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను పరిశీలిస్తే.. టైటిల్ పై ఓ స్పష్టత వచ్చేయచ్చు. దీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్ ఫోటోతో పాటు.. నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా నడిచి వెళుతున్నట్లుగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ కనిపిస్తుంది. ఇలా రకరకాల కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

అఙ్ఞాతవాసి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న మూవీ అప్ డేట్స్ కూడా కొన్ని తెలియచేశారు. అయితే ఈ అఙ్ఞాత వాసి అనే టైటిల్ కన్‌ఫార్మా కాదా అన్నదానిమీద స్పష్టత అయితే లేదు. కానీ సోషల్ మీడియాలోనూ, ఫ్యాన్స్ గ్రూపుల్లోనూ ఈ పేరు చక్కర్లు కోడుతోంది.

చిరంజీవి సడెన్ సర్‌ప్రైజ్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకు చిరంజీవి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో అవాక్కవడం పవన్ వంతు అయింది. పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు.. కొందరు కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. ప్రముఖులు అంతా ట్వీట్స్ చేస్తుంటే చిరు మాత్రం స్టైల్ మార్చారు. తన భార్య సురేఖతో కలిసి పవన్ మూవీ సెట్స్‌ను సందర్శించి స్వయంగా బర్త్‌డే విషెస్ తెలిపారు.

అవాక్కయ్యారు దీంతో పవన్‌తో పాటు.. చిత్ర యూనిట్ కూడా ఒక్కసారిగా చిరు ఫ్యామిలీతో అక్కడికి రావడం చూసి అవాక్కయ్యారు. మెగా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఓ సందేశాన్ని అభిమానులకు ఇచ్చినట్టయిందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవల జరిగిన చిరు బర్త్‌డే సందర్భంగా పవన్ కూడా అన్నను కలిసిన విషయం విదితమే.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here