పరిణీతి చోప్రా ట్వీట్‌కి పాండ్యా క్లీన్ బౌల్డ్…

0
71

హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా? అనే అనుమానం అభిమానులకు కలిగింది.

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా మధ్య ట్విటర్‌ సంభాషణ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్‌ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన పరిణీతి.. ‘అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది’ అని ట్వీట్‌ చేసింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here