వరల్డ్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌: అంకుర్‌కు రజతం

0
62

హైదరాబాద్: వరల్డ్ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్ రజతం సాధించాడు. మంగళవారం డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో అంకుర్‌ 66 పాయింట్లతో రెండో స్థానంతో సాధించాడు. క్వాలిఫయర్స్‌లో 145 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్న అంకుర్‌ మిట్టల్, ఫైనల్లో ఆరంభం నుంచి అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే చివరి నాలుగు షాట్‌లలో అంకుర్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రష్యాకు చెందిన విటాలి ఫోకీవ్‌ 68 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలిచిన అంకుర్‌కు వరల్డ్ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇదే తొలి పతకం కావడం విశేషం. మరోవైపు వరల్డ్ జూనియర్‌ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఓ స్వర్ణం, రజతం గెలుచుకుంది.జూనియర్ కేటగిరీలో 17 ఏళ్ల అవర్ రిజ్వి రజతం నెగ్గి భారత్ ఖాతాలో రెండో పతకాన్ని చేర్చాడు. ఇక, జూనియర్‌ పురుషుల డబుల్‌ ట్రాప్‌ జట్టు విభాగంలో భారత్‌ 401 పాయింట్లతో స్వర్ణం సాధించింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here