చైతూ సినిమా కొనేందుకు ముందుకు రాని బయ్యర్లు…

0
136

సంఘం శరణం గచ్చామి అనేది గౌతమ బుద్దుడు ప్రబోధించిన ప్రవచనం. కానీ యుద్దం శరణం గచ్చామి అంటున్నారు అక్కినేని నాగ చైతన్య. అంత మాట చెబుతున్నా… ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదట బయ్యర్లు. యుద్దం శరణం గచ్చామి సినిమా శుక్రవారం విడుదల కానుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు బయ్యర్లు.. గతంలో విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కొనుగోలుచేసి ఆర్థికంగా నష్టపోయారు. అందుకే ఈ సారి చైతూ సినిమా తీసుకునేందుకు వారు తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను కొన్ని ప్రాంతాల్లో నిర్మాతలే విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ బాగానే ఆడాయి. కానీ అంత బిజినెస్ జరగక పోవడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. చిన్న హీరోల సినిమాలకు బాగానే బిజినెస్ జరుగుతోంది. కానీ ‘యుద్ధం శరణం’ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడటం అక్కినేని ఫ్యామిలీకి కాస్తంత ఇబ్బందిగానే ఉంది. ఈ సినిమా కృష్ణ మరిముత్తు దర్శకత్వం వహిస్తుండగా… చైతూకు జోడిగా అందాల భామ లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన మేడ మీద అబ్బాయి’ సినిమా తప్ప మరో మూవీ విడుదల కావడం లేదు. చైతూను మనువాడబోతున్న సమంత బాగానే ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఎంత వరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here