దుబాయ్‌లో ఆడియో.. హైదరాబాద్‌లో టీజర్‌..

0
45

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0పై రెండు రోజుల కిందట కూడా పుకార్లు వచ్చాయి. ఈ సినిమా చెప్పిన టైమ్ కు రాకపోవచ్చంటూ తెలుగు, తమిళ మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై శంకర్ రియాక్ట్ అయ్యాడు. 2.0 సినిమా వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించిన శంకర్.. సినిమాకు సంబంధించి ఇంకొంత అదనపు సమాచారాన్ని కూడా అందించాడు.

2.0 సినిమాకు సంబంధించి వచ్చేనెలలో ఆడియో నిర్వహించబోతున్నారు. అది కూడా దుబాయ్ లో ఈ ఆడియో ఫంక్షన్ వేడుక ఉంటుంది. ఇక నవంబర్ లో టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ వేడుకను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఇక డిసెంబర్ లో చెన్నైలో ట్రయిలర్ విడుదల ఉంటుంది. ఇలా నెలకో భారీ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు ప్రకటించాడు శంకర్. తేదీల్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు.

మరోవైపు 2.0 సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రచారం పర్వం కొనసాగుతూనే ఉంది. హాలీవుడ్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎగరేసి ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించిన యూనిట్.. తర్వాత న్యూజిలాండ్, లండన్ లో కూడా ఈ తరహా బెలూన్లు ఎగరేసింది. త్వరలోనే మరిన్ని దేశాల్లో 2.0 ప్రచారాన్ని షురూ చేయబోతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here