నటి ఫోటోలు తీసినందుకు ఫోటో జర్నలిస్టులపై దాడి

0
29

ముంబై: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఫోటోలు తీసిన ఫోటో జర్నలిస్టులపై హోటల్‌ బౌనర్స్‌ దాడి చేశారు. ముంబైలో అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నటి శిల్పా శెట్టి, భర్త రాజ్‌కుంద్రాతో డిన్నర్‌ కోసం ముంబై, బంద్రాలోని బస్టైన్‌ హోటల్‌కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడున్న ఫోటో జర్నలిస్టులు, ఔత్సాహికులు కెమెరాలు క్లిక్కుమనిపించారు. ఆశ్చర్యమేమిటంటే వారు కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు.
అక్కడంతా సజావుగానే గడిసింది. అయితే ఈ జంట కారులోకి వెళ్లి కూర్చోగానే హోటల్‌ బౌన్సర్లు ఒక్కసారిగా ఫోటో జర్నలిస్టులపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో సోను, హిమన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగం అంతా కెమెరాలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసిన ఇద్దరి బౌన్సర్లతోపాటు ఫోటో జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here