జై లవకుశ టీజర్‌ విడుదల

0
281

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ జై, లవ, కుశ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మూడో పాత్రైన కుశ పరిచయం చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్‌లో తారక్‌.. కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలోఇన్వెస్ట్‌ చేసి ఆ ఆధార్‌ కార్డేదో నాకు ఇప్పిచ్చేయండి బాబూ అని తారక్‌ అంటుంటే.. దాన్ని ఆధార్‌ కార్డు అనరమ్మా గ్రీన్‌ కార్డు అంటారు అని చెప్పడం ఫన్నీగా ఉంది. ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here