యూఎస్‌ ఓపెన్: సెమీస్‌కు సానియా.. వీనస్‌ ఓటమి

0
29

స్పోర్ట్స్‌: యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరో సంచలనం నెలకొల్పింది. మహిళల డబుల్స్‌​ విభాగంలో తన భాగస్వామి, చైనాకు చెందిన షుయె పెంగ్‌తో కలిసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
గురువారం రాత్రి జరగిన క్వార్టర్‌ ఫైనల్‌లో 7-6(5), 6-4 తేడాతో ఆండ్రియా హ్లావ్కోవా, టిమియా బాబోస్‌ జోడీపై విజయం సాధించింది. వరుసగా ఐదు యూస్‌ ఓపెన్‌లలో సానియా సెమీస్‌కు ప్రవేశించటం ఇది నాలుగోసారి.
సెమీస్‌లో వీనస్‌ అవుట్‌…
ఇక మహిళల సింగిల్స్‌లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రపంచ టెన్నిస్‌ మాజీ ఛాంపియన్‌ వీనస్‌ విలియమ్స్‌ టోర్నీ సెమీస్‌ లో ఓటమి పాలైంది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ లో అమెరికాకు చెందిన స్లోనే స్టీఫెన్స్‌ చేతిలో 6-1, 0-6, 7-5 తేడాతో ఓడింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here