మోదీ చేసిన ఓ ట్వీట్ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనుందా..?

0
25
ఒక విజయం రాష్ర్ట రాజకీయాన్ని మార్చింది…ఆ విజయమే రెండు పార్టీల మధ్య బంధాన్ని మరింత బలీయంగా చేసింది. ఓ ట్వీట్ రాష్ర్ట రాజకీయాల పై పెను ప్రభావం చూపింది. స్వపక్షంలో ఉన్న విమర్శకుల నోరు మూయించింది. ఎన్డీయే లోని మిత్ర పక్షాల మధ్య బంధాన్ని బలోపేతం చేసింది. ఓ విజయం, ఓ ట్వీట్ రాష్ర్ట రాజకీయాల్లో తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నిక అధికారపార్టీకి ఘన విజయాన్ని అందించింది.. ఇది తెలుగుదేశంపార్టీ శ్రేణులకే కాకుండా పరిశీలకులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.. పార్టీకి బలమైన పునాదులు ఏర్పడుతున్నాయని నేతలు సంబరపడుతున్నారు. అదే సమయంలో ఈ విజయం మిత్రపక్షాలైన తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.. ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీల మధ్య సంబంధాలపై కూసింత అనుమానాలు వచ్చాయి.. అగ్రనేతల మధ్య రిలేషన్స్‌ బాగానే ఉన్నా… రాష్ర్ట నేతలు మాత్రం అప్పుడప్పుడు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఉభయ పార్టీల సభ్యులతో ఉన్న సమన్వయ కమిటీ సమావేశంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నా.. రెండు పార్టీల నేతలు నోరు జారకూడదని అనుకున్నా.. రెండు వైపుల నుంచి ఆ నియామావళిని ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల కాలంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవడం.. రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలతో తెలుగుదేశంపార్టీలో అసహనం ప్రారంభమయ్యింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here