తమ్ముళ్లూ ఇదిగో క్లారిటీ.. జాగ్రత్త!

0
49

అధికార తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల నుంచి ఇంకా తమ పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఉంది. ఇటీవలి పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకంగా పార్టీ నాయకులకు ఇదే సందేశం ఇచ్చారు. పార్టీ శ్రేణులకు ఇలాంటి హెచ్చరికే చేశారు. ప్రధానంగా వైకాపా నుంచి బలమైన నాయకుల్ని తమ పార్టీలోకి తీసుకోవాలని పరోక్షంగా పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. ఇతర నాయకులు వస్తున్నారని ఉన్నవారు ఆందోళన చెందితే లాభం లేదని.. పార్టీ బలోపేతం కావడానికి కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని సంకేతాలు కూడా ఇచ్చారు.

మొత్తానికి ఫిరాయింపుల మీద వారి ధ్యాస ఉంది. అయితే… రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశం లేదని.. కేంద్రం దాదాపు స్పష్టం చేసేసినా.. ఫిరాయింపుల కోసం తెదేపా మాత్రం ఇంకా ఆ తాయిలాన్నే పట్టుకుని పలువురికి ఎరవేస్తున్నదని సమాచారం. అలాంటి ఆశలు తెలుగు తమ్ముళ్లు ఎవరికైనా ఉంటే.. వాటికి నీళ్లొదులుకోవాల్సిందిగా తాజా క్లారిటీ కూడా వచ్చేసింది. ఇన్నాళ్లూ ఢిల్లీ వర్గాలను కోట్ చేస్తూ.. ‘తెలిసింది తెలిసింది..’ అంటూనే అంతా నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. కేసీఆర్ చేసిన ప్రకటన కూడా పూర్తి స్పష్టతతో చేసిన అధికారిక ప్రకటన కాకపోవడం.. ఏపీలో తెదేపా నాయకులు ఇంకా ఫిరాయింపుదార్లకు అవే ఆశలు చూపించడానికి కారణమైంది.అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఈ నియోజకవర్గాల పెంపు గురించి ఓ ప్రకటన చేశారు. దీనిని నిజానికి అధికారిక ప్రకటనగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఇంక నియోజకవర్గాల పెంపు అనే ప్రక్రియ 2019 ఎన్నికల్లోగా జరగడం సాధ్యం కాదని ఆయన తేల్చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here