హెలిస్కూప్: బౌలర్‌ని కన్ఫ్యూజ్ చేసేలా క్రీజులో కత్తిసాము

0
32

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కో బ్యాట్స్‌మెన్‌ ఒక్కో బ్యాటింగ్‌ శైలితో ఆడుతుంటారు. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్లు కొన్ని కొత్త షాట్లను కూడా కనిపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సరిగ్గా ఇలానే హెలికాప్టర్‌ షాట్‌తో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పర్ కట్‌తో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, దిల్‌స్కూప్‌ షాట్‌తో శ్రీలంక మాజీ క్రికెటర్‌ తిలకరత్నే దిల్షాన్‌లు ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ టీ20 మ్యాచ్‌ వీడియో షాట్‌ హాట్‌ టాపిక్‌ అయింది. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ ఆడిన షాట్‌కు ఏ పేరు పెట్టాలంటూ క్రికెట్‌ అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు. చివరకు దీనికి హెలిస్కూప్‌ షాట్‌ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోని మీరు చూడండి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here