ఫిట్‌గా ఉంటే మరో పదేళ్లు క్రికెట్‌లో కొనసాగుతా: కోహ్లీ

0
258

హైదరాబాద్: సరైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉంటే మరో పదేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇంకో రెండు నెలల్లో కోహ్లీకి 29 ఏళ్లు పూర్తవుతాయి. శుక్రవారం ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ తాను ఇంకో పదేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందు కోసం ఇప్పటిలాగే ఫిట్‌గా ఉంటే చాలని అన్నాడు. మనలో చాలా మంది ఆటగాళ్లకు తమ కెరీర్‌ను ఎప్పుడు ముగించాలనే దానిపై స్పష్టత ఉండదు. చాలామందికి వాళ్లు ఎంత పెద్ద స్థాయికి వెళ్లగలరన్నది తెలియదు. మన సామర్థ్యంలో 70 శాతం వరకే ఉపయోగించుకుంటుంటాం. ఈ స్థితిలో మనకు మనం ప్రేరణ ఇచ్చుకోవడం అవసరం. ఉదాహరణకు నేను ఇప్పుడు శ్రమిస్తున్న తరహాలోనే మున్ముందు కూడా కష్టపడితే మరో పదేళ్లు సునాయాసంగా ఆడగలను’ అని కోహ్లీ అన్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here