విరాట్ కోహ్లీపై ప్రశంశల జల్లు…

0
95

హైదరాబాద్‌: విరాట్‌ కోహ్లీ తన ఆటతీరు, ప్రవర్తనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విరాట్‌ చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అయింది. తనను ప్రభావితం చేసిన క్రికెటర్ల లిస్టుతో ఉన్న ఫోటోను పోస్టు చేసి వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. అందులో భారతతో పాటు ఇతర దేశాల మాజీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అందులో పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జావేద్‌ మియాందాద్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్లుకూడా ఉన్నాయి.

తమ దేశ ఆటగాళ్లను గురువులుగా గౌరవించడంతో పాకిస్తాన్‌ అభిమానులు విరాట్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పాకిస్తాన్‌ ఆటగాళ్లను గౌరవించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఓ పాక్‌ వీరాభిమాని మాత్రం తన పైత్యం ప్రదర్శించాడు. కోహ్లీ పెట్టిన ట్వీట్‌కు బదులిస్తూ ‘మీరు ఏమీ అనుకోకుండా ఈపోస్టు పెట్టిన జెంటిల్‌మెన్‌ పేరు చెబుతారా’ అంటూ కోహ్లీ ఎవరో తెలియదన్నట్లుగా పోస్టు పెట్టాడు. అయితే ఆట్వీట్‌కు మరో పాక్‌ అభిమాని ఘాటుగానే జవాబు ఇచ్చాడు. అతని పేరు విరాట్‌ కోహ్లీ, భారత క్రికెట్‌ జట్టుకు నాయకుడు, ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్‌మెన్‌. అతని వెనుక ఉన్నవి ప్రఖ్యాత క్రికెటర్ల పేర్లు.’ అంటూ బదులిచ్చాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here