అండర్‌-19 జట్టుకు ఎంపికైన సచిన్ తనయుడు..

0
22

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. బరోడాలో నిర్వహించే జేవై లీలీ ఆల్‌ ఇండియా అండర్‌-19 ఇన్విటేషనల్‌ వన్డే టోర్నమెంట్‌కి అర్జున్‌ని ఎంపిక చేశారు. ఈ టోర్నీ సెప్టెంబర్‌ 16 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. 17 ఏళ్ల అర్జున్‌ గతంలో ముంబై అండర్‌-14, అండర్‌-16 జట్ల తరుపున ఆడిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్‌ది కుడి చేతివాటం బ్యాటింగ్ అయితే అర్జున్‌ది ఎడమ చేతి వాటం బ్యాటింగ్ కావడం విశేషం. ఆల్ రౌండరైన అర్జున్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌ సమయంలో తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ క్రికెటర్ బెయిర్ స్టోను గాయపరిచిన సంగతి తెలిసిందే.అంతేకాదు ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌‌కు ముందు మిథాలీసేన కోసం నెట్స్‌లో బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో మిథాలీ సేన 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here