జడ్చర్లలో కాంగ్రెస్‌ నేత దాష్టీకం

0
24

జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పోలీసులు, బాధితురాలు జయలక్ష్మి కథనం ప్రకారం.. స్థానిక ఫ్లైఓవర్‌ వంతెన సమీపంలో ఓ రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వేమారెడ్డి ఇల్లు ఉంది. వీరి ఇంటి పక్కనే ఉంటున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి ఇల్లు ఉంది. వేమారెడ్డి గత కొన్నేళ్ల కిందట మృతిచెందారు. అయితే హెడ్‌కానిస్టేబుల్‌ ఇంటిని అమ్మాలని గత పదేళ్లుగా రామచంద్రారెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు. తన భర్త వేమారెడ్డి బతికి ఉన్న సమయంలోనే పలుమార్లు పిలిపించి ఇంటిని తనకు విక్రయించాలని కోరితే తాము అంగీకరించలేదు.
అప్పటి నుంచి తమపై కక్ష పెంచుకుని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి ముందు నిమ్మకాయలు, ఉల్లిపాయలు, పసుపు, కుంకుమలు వేశారు. తాజాగా కొన్ని రోజుల కిందట తమ ఇంటి ముందున్న గ్రామ పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేయగా తాము అడ్డుకున్నామన్నారు. దీంతో మరింత కక్ష పెంచుకుని ఇంటి ముందు మల, మూత్రాలు పారబోసిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ రోజు ఇంటి తలుపుల దగ్గర, మరో రోజు ఇంటి గేటు, దుకాణాల షట్టర్ల ముందు మలమూత్రాలు పారబోశారు.
వీటిని నిత్యం తాము శుభ్రపరుచుకోలేకపోతున్నామని.. వీటిని ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించామన్నారు. దీం తో హైదరాబాద్‌లో ఉన్న తమ కుమా రుడు కేశవర్ధన్‌రెడ్డిని పిలిపించి శనివా రం రాత్రి నిఘా పెట్టగా.. రాత్రి 2 గంటల ప్రాంతంలో తన ఇంట్లో నుంచి రెండు ప్లాస్టిక్‌ కవర్లతో బయటకు వచ్చిన రామచంద్రారెడ్డి ఆ కవర్లలో ఉన్న మల, మూత్రాలను తమ ఇంటి ముందు పారబోస్తుండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టున్నామన్నారు. అయితే ఈ సంఘటనపై ఇరువురు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here