మణిరత్నంకు హీరో దొరికాడు!

0
326

దాదాపు ఐదారేళ్ల నుంచి ఒక మల్టీస్టారర్ సబ్జెక్టును పట్టుకుని తిరుగుతున్నాడు దర్శకుడు మణిరత్నం. ఆ సినిమాను ఎలాగైనా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఇందుకోసం ఆయన చాలా మందినే సంప్రదించాడు. కొందరు ఓకే కూడా చెప్పారు. ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అయితే.. కొన్నాళ్లకు ఆయా ప్రాజెక్టులు ఆగిపోతూ వచ్చాయి.

అప్పుడెప్పుడో మహేశ్ బాబు, నాగార్జునల కాంబోలో అన్నారు. ఆ విషయాన్ని సుహాసిని ప్రకటించింది. మహేశ్ బాబు కూడా ట్విటర్ లో ప్రకటించేశాడు. అయితే.. సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆగిపోయిందన్న ప్రకటన తర్వాత వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం ఓకే బంగారం సినిమాను పట్టాలెక్కించి హిట్టు కొట్టాడు. దీంతో మళ్లీ మల్టీ స్టారర్ తెరపైకి వచ్చింది.

కార్తీ, దుల్కర్ సల్మాన్లతో ఆ సినిమా చేయబోతున్నారన్నారు, అదీ జరగలేదు. ఆ తర్వాత నాని ఈ ప్రాజెక్టులో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా.. అలా.. హీరోల పేర్లు మారుతూ వచ్చాయి. మరి ఇప్పుడు ఆసక్తికరమైనది ఏమిటంటే.. మణి సినిమాలో నటించడానికి తమిళ హీరో శింబు ఓకే చెప్పాడట. ఇప్పటికే సైన్లు కూడా అయిపోయాయని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో శింబుతో పాటు విజయ్ సేతుపతి రెండో హీరోగా కనిపిస్తాడట. అలాగే అరవింద్ స్వామి, జ్యోతికలు కూడా నటిస్తారని.. ఐశ్వర్యరాయ్ ఒక ప్రధాన పాత్రలో మెరుస్తుందని అంటున్నారు. మరి ప్రస్తుతానికి శింబు మాత్రమే అధికారికం అని, మిగతా వాళ్లతో సంప్రదింపులు అని టాక్. మరి ఈ సారి ఈ సినిమా ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here