మహిళతో అక్రమ సంబంధం: యజమాని హత్యకు అనేక ప్లాన్స్..

0
64

ఏలూరు: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె భర్తను హతమార్చడానికి ఓ వ్యక్తి ప్లాన్‌ల మీద ప్లాన్‌లు వేసి విఫలమయ్యాడు. అతన్ని హత్య చేయడానికి కిరాయికి తీసుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పాలుపోయడానికి వస్తూ ఆ ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అడ్డు తొలగించుకోవడానికి యజమాని అయిన పెయింటర్‌ను హత్య చేయడానికి, ఆ తర్వాత హత్య చేయించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనలో పోలీసులు 9 మంది అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. కేసు వివరాలను ఆదివారం రాత్రి ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏలూరు డిఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన ముల్పూరి వెంకటేశ్వరరావు (45) పాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి లారీ, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏలూరు రామచంద్రరావుపేటలో ఒక వీధిలో ఉన్న ఒక కుటుంబానికి ఏడాదిన్నర నుంచి పాలు పోస్తున్నాడు. దీనిలో భాగంగానే ఆ ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.


పెయింటర్ భార్యపై అనుమానం…
పాల వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పెయింటర్‌ భార్యపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెయింటర్‌ను చంపడానికి హంతకులు ఒక విషంతో కూడిన ఇంజెక్షన్‌ సిరంజిని సిద్ధం చేసుకున్నారని, ఇది ఎవరి ద్వారా పెయింటర్‌కు ఇంజెక్షన్‌ చేయడానికి సిద్ధం చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాల వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళను కూడా పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here