వల్గారిటీ: చూసే కళ్ళలోనా.? చేసే ప్రదర్శనలోనా.?

0
33

మేం ఎప్పుడూ ఒకేలా వుంటాం.. మీ కళ్ళలోనే ఏదో తేడా వుంది.. చీరలో అయినా, మోడ్రన్‌ డ్రస్సుల్లో అయినా అదే అందం.. చూసే కళ్ళని బట్టే అది అందమా.? వల్గారిటీనా అనేది ఆధారపడి వుంటుంది..’ అంటూ హీరోయిన్‌ శ్రియ, తాజాగా ఓ ఇంటర్ల్యూలో ‘గ్లామర్‌ – వల్గారిటీ’ అంశంపై స్పందించింది.

‘చీరలో కనిపిస్తే పద్ధతిగా వుందంటారు.. అదే మోడ్రన్‌ దుస్తుల్లో కన్పిస్తే చాలు వల్గారిటీ అనే ముద్ర వేసేస్తారు.. చీరకట్టుతోనో, మోడ్రన్‌ డ్రస్సులతోనే ఆయా వ్యక్తుల క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్‌ చేస్తారు.?’ అని అమాయకంగా ప్రశ్నించేసింది శ్రియ. నిజానికి చీరకట్టులోనూ అందం వుంటుంది.. మోడ్రన్‌ డ్రస్సుల్లోనూ అందం వుంటుంది. చేసే అందాల ప్రదర్శన స్థాయిని బట్టి, వల్గారిటీ ఆధారపడి వుంటుందన్న విషయం ఈ అందాల భామలకి ఎప్పుడర్థమవుతుందో ఏమో.!

ఓ ఫొటోలో శ్రియ ట్రెడిషనల్‌ వేర్‌లో కన్పించింది.. వల్గారిటీ అని అనగలమా.? మరో డ్రస్‌లో మోడ్రన్‌ లుక్‌ కోసం.. అందాల విందు చేసేసింది.. దీన్ని వల్గారిటీ అనకుండా వుండగలమా.?

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here