లోకేష్ ఈ సారి ఇంగ్లీషులో ఇరగదీశాడు..

0
334

ఎప్పుడూ ఒకే తరహా మిస్టేక్స్ చేస్తే ఏం బాగుంటుంది, మిస్టేక్స్ కూడా కొత్తగా చేయాలనే మాటను పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్స్ లో రాస్తూ ఉంటారు. ఈ మధ్యనే లోకేష్ బాబుకు తెలుగు నేర్పించడానికి మండలి బుద్ధ ప్రసాద్ గట్టిగా ప్రయత్నించారట. తెలుగు భాషను అమితంగా ప్రేమించే ఈ నేత ద్వారా లోకేష్ కు తెలుగు విషయంలో శిక్షణను ఇప్పించినట్టుగా ప్రచారం జరిగింది.

మరి దాని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ.. లోకేష్ ఈ సారి ఇంగ్లిష్ లో ఇరగదీయడం ఆసక్తికంగా మారింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లోకేష్ బాబు వీడియో ఒకటి ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోలో లోకేష్ తనదైన శైలిలో మాట్లాడాడు. ఈ సారి లోకేష్ ఆంధ్రప్రదేశ్ మీద తన కసి తీర్చుకున్నాడు. ఇది వరకూ తన మాటలతో సొంత పార్టీకి కులపిచ్చి ఉందని చెప్పాడు లోకేష్ బాబు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ను కంట్రీగా చేశాడు, కంపెనీగా అభివర్ణించాడు! ఒక సమావేశంలో లోకేష్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కంట్రీ అని ఒకసారి, ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఒకసారి అని వ్యాఖ్యానించారు. లోకేష్ ఇలా ప్రసంగించిన వీడియో ఇంటర్నెట్ లో షేర్ అవుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ ను పట్టుకుని కంట్రీ అని, ఆంధ్రప్రదేశ్ కంపెనీ అని.. లోకేష్ వ్యాఖ్యానించిన తీరు ప్రహసనంగా మారింది.

మరి ఇన్నాళ్లూ లోకేష్ తెలుగు మాట్లాడటంలో వీక్ అని, ప్రసంగాలు ప్రహసనం అవుతున్నాయని విమర్శలు వచ్చాయి. కొంతమంది లోకేష్ ప్రసంగాలను కామెడీగా చూస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఇంగ్లిష్ లో లోకేష్ బాబు తన ‘టాలెంట్’ చూపించి.. ప్రహసనం పాలయ్యారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here