సరికొత్త ఆవిష్కరణలను వెన్నుదన్ను!

0
43

విశాఖపట్నం: సృజనాత్మకంగా ఆలోచించేవారికి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ ప్రోత్సాహక ద్వారాలు తెరిచే ఉంటాయని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విశాఖలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆవిష్కర్తల సదస్సులో ‘ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ (ఏపీసీటీటీ)’ వర్క్‌షా్‌పను ఆయన ప్రారంభించారు. సరికొత్త ఆవిష్కరణలను వెన్నుదన్నుగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. సింగపూర్‌ అభివృద్ధి చెందడానికి 3-4 దశాబ్దాలు పడితే.. ఆంధ్రప్రదేశ్‌ రెండు దశాబ్దాల్లోనే ఆ ప్రగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌ (పారిశ్రామికవేత్త) కావాలన్న తపన ఎక్కువని, అందుకే వారిని ‘ఆంధ్రప్రెన్యూర్‌ ’అని పిలుస్తామని చెప్పారు. కొత్త ఐడియాలతో వచ్చేవారికి ఆర్థిక చేయూతే కాకుండా ఉత్పత్తులను ప్రపంచ స్థాయి మార్కెటింగ్‌కు తీసుకెళ్తామన్నారు. ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్లు అరటి మోదుల(కాండం)తో, ఫైబర్‌తో డిస్పోజబుల్‌ షేవింగ్‌ కిట్లు తయారుచేశారని చెప్పారు. పెట్టుబడులకు విశాఖకు మించిన మంచి వేదిక మరెక్కడా దొరకదని, అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్‌ సేవలకు అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ ఏర్పాటు చేయాలంటే వంద కోట్ల డాలర్లు (రూ.6396 కోట్లు) ఖర్చవుతాయని, కానీ ఇన్నోవేటివ్‌గా ఆలోచించి విద్యుత్‌ స్తంభాల ఆధారంగా కేబుళ్లు వేసి.. కేవలం 5 కోట్ల డాలర్ల(రూ.319 కోట్లు)తో పనులు పూర్తి చేశామని తెలిపారు. నెలకు కేవలం రెండున్నర డాలర్ల (రూ.160) ఖర్చుతో కేబుల్‌, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించగలిగే వ్యవస్థ ఏపీలో తప్ప మరెక్కడా లేదన్నారు.

3 నెలల్లో ప్రారంభించకుంటే..
రుషికొండ ఐటీ హిల్స్‌లో భూములు తీసుకున్న సంస్థలు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలని, లేకుంటే స్థలాలు వెనక్కి తీసుకుంటామని, ఈ మేరకు నోటీసులు జారీ చేశామని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని లోకేశ్‌ స్పష్టం చేశారు. పనులు మధ్యలో ఆపేసిన సంస్థలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మూడో కేటగిరీకి చెందిన సంస్థలు మొత్తం పనులు పూర్తిచేసినా, ఆక్యుపేషన్‌లోకి రాలేదని, అటువంటివి రాబోయే 45 రోజుల్లో లావాదేవీలు ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. రూ.16 వేల కోట్ల లోటు ఉన్నప్పటికీ.. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో 80ు ప్రజలు తమ వెంటే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

నేడు సీఎం రాక..
ఆవిష్కర్తల సదస్సు చివరిరోజైన సోమవారం సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టరులో శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వస్తారు. సాయంత్రం 4 గంటలకు హోటల్‌ గేట్‌వేలో ఆవిష్కర్తల సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30కు నోవాటెల్‌లో అంతర్జాతీయ స్నూకర్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు విజయవాడ బయల్దేరతారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here