శశికళ భర్త నటరాజన్ పరిస్థితి విషమం: లండన్ వైద్యుడు చికిత్స, లివర్, కిడ్నీ ఫెయిల్యూర్స్!

0
40

చెన్నై: ప్రస్తుతం శశికళ భర్త నటరాజన్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు బులిటిన్ విడుదల చేశాయి. గత ఆరు నెలల నుంచి నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.నటరాజన్ కిడ్నీ, లివర్ ఫెయిలైనట్లు తెలిపాయి. కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్స్ కావడంతో ఊపిరితిత్తుల మీద వ్యాధి ప్రభావం చూపడంతో ఆయన ఊపిరిపీల్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఆదివారం దాదాపు 9 గంటల పాటు నటరాజన్ కు డయాలసిస్ చేశారు.
చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ కు సీరియస్: గ్లోబల్ ఆసుపత్రిలో, కన్నెత్తి చూడలేదు!
నటరాజన్ ఆరోగ్య పరిస్థితిని లివర్ స్పెషలిస్టులతో కూడిన ప్రత్యేక టీం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు నటరాజన్ గతంలోనే తమిళనాడు ఆర్గాన్ షేరింగ్ (టీఓఎస్)కు దరఖాస్తు చేసుకుకున్నారు. నటరాజన్ దరఖాస్తు వెయిటింగ్ లిస్టులో ఉందని తమిళనాడు ప్రభుత్వం అంటోంది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రముఖ వైద్యుడు లండన్ లోని కింగ్స్ కాలేజ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మోహమ్మద్ రిల చెన్నై చేరుకుని నటరాజన్ కు వైద్యపరీక్షలు చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here