టెక్సాస్ లో ఏడుగురిని కాల్చిచంపిన ఉన్మాది..

0
34

టెక్సాస్: విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఓ ఉన్మాది ఏడుగురు ప్రాణాలను బలితీసుకున్నాడు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చాడు. చివరికి అతడిని పోలీసులు మట్టుబెట్టడంతో ఈ దారుణకాండ ఆగిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం చోటుచేసుకుందీ ఘోరం. విందు కార్యక్రమం జరుగుతున్న ఇంటికి వచ్చిన నిందితుడు.. ఓ మహిళతో గొడవపడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మాట్లాడుతూనే గన్ను తీసుకుని కాల్పులు జరపడం మొదలు పెట్టినట్టు వెల్లడించారు. కాగా అతడికి బాధితులకు మధ్య సంబంధమేంటన్నది ఇంకా తెలియరాలేదని పోలీస్ అధికారి డేవిడ్ టిల్లే పేర్కొన్నారు. చనిపోయిన వారంతా పెద్దవాళ్లేననీ… కాల్పులు జరిపిన దుండగుడు ఎవరన్నదీ తెలియాల్సి ఉందన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here