తెలుగు టైటాన్స్‌కు నాలుగో విజయం

0
88

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ మరో మ్యాచ్‌ గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 37–19తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది నాలుగో గెలుపు కాగా… రైడింగ్‌లో రాహుల్‌ చౌదరి (10) రాణించాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 10 పాయింట్లు తెచ్చిపెట్టాడు. డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ టాకిల్‌లో 6 పాయింట్లు సాధించాడు. నీలేశ్‌ సాలుంకే 5, మోసిన్, సోమ్‌బిర్‌ చెరో 3 పాయింట్లు చేశారు. టైటాన్స్‌ ఆటగాళ్లు రెండు సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేశారు.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 24–20తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here