నంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి ‘ఆది’ ఆసక్తికరం

0
76

నంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి ‘ఆది’ ఆసక్తికరం

అమరావతి:నంద్యాల ఉపఎన్నికల్లో విజయంతో ఆ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంతో ఉన్నారు. వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌కిషోర్ ‌కు ఆ పార్టీ రూ.50 కోట్లు చెల్లించనుంది. అయితే నంద్యాలలో టిడిపి అభ్యర్థి విజయం సాధించేందుకు కృషి చేసిన తమకు రూ.100 కోట్లు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు తమకు ఇవ్వాలని వారు సరదాగా అంటున్నారు. ఏపీ సచివాలయంలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకొన్న ఆసక్తికర సంభాషణ ఆసక్తికరంగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకుగాను ఆ పార్టీ ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకొంది. అయితే నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పరాజయం పొందారు.

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. సుమారు నెలరోజులుగా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ సూచనలు, సలహలకు అనుగుణంగానే నంద్యాలలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అనుసరించారు. అయితే ఈ వ్యూహం మాత్రం నంద్యాల ఎన్నికల్లో బెడిసికొట్టింది. నంద్యాల ఫలితాలపై మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేల మధ్య పేషీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here