పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లు ఔట్: జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి

0
22

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి చిన్నమ్మ శశికళను, దినకరన్‌ను తొలగించారు. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, డిప్యూటీ జనరల్ సెక్రటరిగా దినకరన్‌లు ఉన్నారు. మంగళవారం అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శశికళను, దినకరన్‌లను తొలగిస్తూ అన్నాడీఎంకే తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

రెండాకుల గుర్తు తమదేనని కూడా అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పన్నీరుసెల్వంను ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించారు. మరోవైపు, శశికళను, తనను తొలగించే హక్కు వారికి లేదని దినకరన్ అన్నారు. అవసరమైతే తాము ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మండిపడ్డారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here