‘టెస్లా’ను సందర్శించిన రాహుల్‌

0
28

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం సోలర్‌ ప్యానెళ్లను తయారుచేసే సన్‌ పవర్‌ కార్పొరేషన్‌ పరిశోధానా కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ కేంద్రంలో కొన్ని గంటల పాటు గడిపిన రాహుల్‌ భారత్‌లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్యామ్‌ పిట్రోడా తెలిపారు. సన్‌ కార్పొరేషన్‌ను సందర్శించిన అనంతరం రాహుల్‌ లాజ్‌ ఏంజెలెస్‌కు బయలుదేరారు. లాస్‌ఏంజెలెస్‌ పర్యటనలో భాగంగా పలువురు స్థానిక నేతలతో పాటు మేధావులతో రాహుల్‌ భేటీ కానున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here