పెళ్లి కోసం… ఓ ప్రేమ లెహంగా!

0
1431

గుర్తుందా? నిశ్చితార్థం రోజున సమంత కట్టుకున్న చీర. నాగచైతన్యతో పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు నిశ్చితార్థం వరకూ తమ మధ్య జరిగిన అందమైన అనుభూతులను బొమ్మల రూపంలో చీరపై డిజైన్‌ చేయించారు. ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ ఆ చీరను రూపొందించారు. మరో పదిహేను రోజుల్లో జరగనున్న పెళ్లికీ సమంత దుస్తులను ఆమె డిజైన్‌ చేస్తున్నారు. పెళ్లికి చీర కాకుండా, ఓ ప్రేమ లెహంగాను డిజైన్‌ చేశారు.

అక్టోబర్‌ 6న హిందూ సంప్రదాయంలో జరగనున్న పెళ్లిలో చైతూ అమ్మమ్మ రాజేశ్వరి (డి. రామానాయుడి భార్య) చీరను సమంత కట్టుకుంటారట! తర్వాత రోజు, 7వ తేదీన క్రిస్టియన్‌ పద్ధతిలో జరగనున్న పెళ్లికి ఈ ప్రేమ లెహంగాను ధరిస్తారట! ‘‘నా పెళ్లి విషయంలో నేనెవరినైనా నమ్మానంటే… అది క్రేశానే. తను డిజైన్‌ చేసిన లవ్‌స్టోరీ లెహంగాలు సూపర్బ్‌’’ అని సమంత పేర్కొన్నారు. లెహంగాలపై క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉంటుందో మరి!!

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here