ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

0
987

న్యూఢిల్లీ : దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్‌ మేగజైన్‌ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజాగా హండ్రెడ్‌ గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజొనెస్‌ మైండ్స్‌ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అందులో భారత్‌ నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా, ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ అధినేత లక్ష్మీ మిట్టల్‌, సన్‌ మైక్రో సిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకులు వినోద్‌ ఖోస్లాలకు అందులో చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్‌ మేగజైన్‌ ఆరంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్‌ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరచడం జరిగింది. ఈ సంచితకపై ఫోర్బ్స్‌ సిబ్బంది మాట్లాడుతూ..ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మేగజైన్‌ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here