బిగ్‌బాస్ షో విజేత శివబాలాజీయేనా? దానికి కారణం వాళ్లేనా?

0
1048
బిగ్‌బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలిపోయారు. కానీ విజేత విషయంలో మాత్రం తీవ్ర సందిగ్దం నెలకొంది. కానీ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం శివబాలాజీకి మద్దతు తెలియజేస్తున్నారని టాక్.. కాబట్టి శివబాలాజీయే విజేత అనే వార్త షికారు చేస్తోంది. పవన్‌కి ఇష్టమైన వ్యక్తుల్లో శివ బాలాజీ ఒకరు. శివ లవ్ మ్యారేజ్‌కి పవన్ అండగా నిలిచారు. నాటి నుంచి శివకు పవన్ తన సినిమాల్లో అవకాశం కల్పిస్తూ వస్తున్నారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా శివను సపోర్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం శివకు విజేత కావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరో కారణం శివ వివాదరహితుడు కావడం. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టేస్తారు. హౌస్ మేట్స్‌ను జాగ్రత్తగా చూసుకోవడం.. తన కో పార్టిసిపెంట్స్‌కు ఎలాంటి వంటకాలనైనా చేయించి పెట్టడం.. శివకు ప్లస్ పాయింట్స్. చాలా పరిపూర్ణతతో ఆడుతున్న శివకు పవన్ ఫ్యాన్స్ తోడైతే విజేత కావడం పక్కా అని తెలుస్తోంది

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here